కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడలో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ హమీద్ పటేల్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో బాధితులను అందరినీ ఆదుకుంటామన్నారు. ప్రతి కుటుంబానికి సహాయం అందిస్తామని తెలిపారు. సహాయం అందుకున్న వారు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు, వార్డు మెంబర్ జంగంగౌడ్, వైస్ ప్రెసిడెంట్ భీమిలి శ్రీనివాస్, నీలం లక్ష్మినారాయణ, కుమార్, యూత్ నాయకులు దీపక్, మతిన్, ఖాసీం, స్థానికులు ఉన్నారు.






