ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి

  • బిఆర్ ఎస్ ప్రధానకార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో అంబరాన్ని తాకిన వేడుకలు
  • వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు
కేక్ కట్ చెస్తూ…

నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు జాతి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ నిజాంపేట్ క్రాస్ రోడ్స్ లో ఈ శతజయంతి వేడుకలు బ్రహ్మండమైన పండగ వాతావరణంలో నిర్వహించారు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పయ్యారని, తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారని బండి రమేష్ అన్నారు.

స్వర్గియ నందమూరి తారకరామరావు విగ్రహానికి నివాళి అర్పిస్తూ..

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిత్య అన్నదాన 15 టన్నుల వివిధ రకలైన కూరగాయలు మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో పంపించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమనికి నందమూరి తారకరామారావు అభిమానులు వేలాదిగా తరలివచ్చి వేడుకలు జయప్రదం చేసారని, బండి రమేష్ అందించిన అధిత్యం స్వీకరించారని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here