ఒకవైపు వైభవం..మరో వైపు వరాల జల్లు

  • వేద శాస్త్ర పండితుల గౌరవ వేతన భృతి 5 వేలకు పెంపు
  • 65 ఏళ్లకే గౌరవ భృతి పొందే అవకాశం
  • 2796 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపు
  • అర్చకులకు నగదు సహాయం రూ.10 వేలకు పెంపు
గోపనపల్లి వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్ పల్లి వద్ద విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై పూజ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. బ్రాహ్మణ సోదరులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వేద, శాస్త్ర పండితుల గౌరవ వేతన భృతి రూ. 2500 నుండి రూ. 5000 కు పెంచారు. అదేవిధంగా వేద, శాస్త్ర పండితుల గౌరవ భృతి పొందే అర్హత వయస్సు 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గించారు.

వేద మంత్రోచ్చరణలతో…

మరో 2796 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజెషారు. ప్రస్తుతం ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల నిర్వహణ కోసం అర్చకులకు అందించే నగదు సహాయం రూ. 6000 నుంచి రూ.10 వేల కు పెంచారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం అందించే రూ. 2 లక్షల అన్యువల్ గ్రాంట్ గా ప్రతి ఏటా విడుదల చెయనున్నారు. వీటి తొపాటు ఐఐటీ, ఐఐఎం లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు విశ్వవిద్యాలయం మెదక్ లో ఏర్పాటు చెయనున్నారు.

పూజలు చేస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here