నిరుపేద మహిళ వైద్యానికి హోప్ ఫౌండేషన్ ఆర్ధిక సాయం

 

మహిళకు రూ.10 వేల నగదును అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్

హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): న్యూ హాఫీజ్ పేట్ కి చెందిన సరిత అనే మహిళ వైద్య చికిత్సల నిమిత్తము హోప్ ఫౌండేషన్ తరపున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నిరుపేద మహిళ వైద్యంకోసం ఆర్థిక సహాయం అందించడం చాల గొప్ప విషయమని అన్నారు. సమాజ హితం కోసం సేవలు చేయడం చాల గొప్ప విషయం అని, ఆ మర్గంలో పయణిస్తున్నందుకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ని ప్రభుత్వ విప్ గాంధీ గారు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు సమాజం కొరకు తమవంతు సహకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here