శ్రీ రాముని సేవలో నిమ్మల ధాత్రినాథ్…అయోధ్య మందిరానికి రూ.1 లక్ష నిధి సమర్పణ

నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీ రామ భవ్య మందిర నిర్మాణానికి ఎన్ఎమ్జీ ట్రస్ట్ చైర్మన్, టిఆర్ఎస్ యువ‌నేత‌ నిమ్మల ధాత్రినాథ్ గౌడ్ రూ. 1 లక్ష నిధి సమర్పణ చేశారు. ఆదివారం కొండాపూర్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ అభియాన్ కార్యక్ర‌మంలో ద‌క్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ మాననీయ సుధీర్ జీకి చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ధాత్రినాథ్‌గౌడ్ మాట్లాడుతూ భ‌వ్య రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునే అవ‌కాశం ల‌భించ‌డం త‌న‌కు ల‌భించిన అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌రాముని సేవ‌లో పాల్గొన‌డం హిందువుగా ప్ర‌తిఒక్క‌రి బాధ్య‌త అని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ నారాయణ మూర్తి, రంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్ లు ధాత్రినాథ్‌గౌడ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సుధీర్ జీకి చెక్కును అంద‌జేస్తున్న నిమ్మ‌ల ధాత్రినాథ్ గౌడ్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here