శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎం.సందీప్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన జేఏసీ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్బంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు వెంకటేశ్వర్ రెడ్డికి, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రెడ్డి వర్గానికి చెందిన పేదలకు చేయూతను అందించేందుకు, జేఏసీ తరఫున సహాయ కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.