కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి బస్తీ, కాలనీలో ప్రజలు కోరుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతోపాటు, సమస్య ఉన్న చోట్లకు వ్యక్తిగతంగా వెళ్లి సమస్యలను తెలుసుకొని తగిన విధంగా పరిష్కరించటం జరుగుతున్నదని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. ఆదివారం కొండాపూర్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలోని జెమ్ మోటార్స్ సర్వీసింగ్ సెంటర్ వెనుక రూ.32 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్ల పనులను హమీద్ పటేల్ పరిశీలించారు.
డివిజన్ లో మంజూరు అయిన అంతర్గత రోడ్లను శరవేగంగా పూర్తి చేసేట్లు చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ గారి విజన్ తో, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కృషితో డివిజన్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. షేక్ జమీల్, రాఘవయ్య, శశి కుమార్, దుర్గా ప్రసాద్, యూత్ నాయకులు దీపక్, కల్యాణ్ నాయక్, కాలనీ వాసులు పాల్గొన్నారు.