- బోధనేతర సిబ్బంది కారణంగా ఎన్నికల ఫలితాల్లో జాప్యం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్, బిజెపి పార్టీల అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. హఫీజ్ పేట్ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ పై 2500 వేల పై చిలుకు ఆధిక్యంలో కొనసాగుతుండగా, శేరిలింగంపల్లి డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి దాదాపు వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక గచ్చిబౌలి డివిజన్ లో బిజెపి 948 ఓట్ల మెజారిటీ లో ఉండగా, కొండాపూర్ డివిజన్ లో బిజెపి దాదాపు 700 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక చందానగర్, మియాపూర్, మాదాపూర్ లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభం కాగా మాదాపూర్ లో టిఆర్ఎస్ ముందు వరుసలో ఉండగా, చందానగర్, మియాపూర్ లలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. మరికొద్దిసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుభవం లేని బోధనేతర సిబ్బంది కారణంగా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 గం.లకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తవ్వాల్సి ఉండగా సాయంత్రం వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.