నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు తొలి రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్లతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రౌండ్ కు 14 వేల ఓట్లను లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రక్రియ అంతా రెండు రౌండ్లలోనే పూర్తి కానుంది. గచ్చిబౌలి డివిజన్ నుండి అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. అధికార టీఆరెస్ పార్టీ నుండి కొమిరిశెట్టి సాయిబాబ, బిజెపి నుండి గంగాధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి అర్కల భరత్ కుమార్ లు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నిలువగా దళిత బహుజన పార్టీ అభ్యర్తిగా అర్షాల రాజు, స్వతంత్ర అభ్యర్థులుగా పి.చంద్ర మౌళి(బ్యాట్ గుర్తు), సంగం ప్రవీణ్ కుమార్ గౌడ్ లు బరిలో ఉన్నారు. ఈ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్లు తెరాసకి 1 వచ్చాయి.
తొలి రౌండ్ ముగిసే సరికి ఎన్నికల ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.
టీఆరెఎస్ –6063
బిజెపి -7011
కాంగ్రెస్ -424
దళిత బహుజన పార్టీ –16
పి.చంద్ర మౌళి –25
సంగం ప్రవీణ్ కుమార్ గౌడ్ -14
NOTA-150
చెల్లని ఓట్లు-297
మెజారిటీ – బిజెపి 948