సైబరాబాద్ పరిధిలో “మై ట్రాన్స్ పోర్ట్ ఇజ్ సేఫ్” యాప్ ఆవిష్కరణ

  • ట్రాఫిక్ రద్దీ, రోడ్డు భద్రతా దృష్ట్యా.  సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ టి. శ్రీనివాస రావు IPS., సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ టి. శ్రీనివాస రావు IPS., ప్రైవేట్ బస్సు, RMC, కన్ స్ట్రక్షన్ వాహనాలు, ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం “మై ట్రాన్స్ పోర్ట్ ఇజ్ సేఫ్”యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నో ఎంట్రీ సమయాల్లో తిరిగే భారీ వాహనాలకు ప్రైవేట్ బస్సులు, RMC, కన్స్ట్రక్షన్ వాహనాలు, స్కూల్ బస్సుల కోసం ప్రత్యేక స్టిక్కర్లు రూపొందించామన్నారు. ట్రాఫిక్ రద్దీ, రోడ్డు భద్రతా దృష్ట్యా.. అవసరమైన వాహనాలకు రూట్ లో మాత్రమే పర్మిషన్ తీసుకోవాలన్నారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ, వినియోగదారుల భద్రత దృష్ట్యా, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు “మై ట్రాన్స్ పోర్ట్ ఇజ్ సేఫ్” అనే అప్లికేషన్ ద్వారా ప్రత్యేక QR కోడ్ కలిగిన స్టిక్కర్లను రూపొందించారన్నారు. నో ఎంట్రీ సమయాలలో ప్రత్యేక అనుమతి కలిగిన వాహనాలకు ఈ స్టికర్క్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాలకు ఉదయం 7.30 నుండి 11.30, సాయంత్రం 4 నుండి 10.30 గంటల వరకు అనుమతి లేదన్నారు. ప్రత్యేక కారణాల దృష్ట్యా ఎవరైనా ఇటువంటి వాహనాలు తిప్పాలంటే సైబరాబాద్ కమీషనర్ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి పర్మిషన్ తీసుకునే వాహనాలకు ఇక నుండి QR కోడ్ కలిగిన స్టిక్కర్లను అందజేస్తారు. ఈ స్టిక్కరలో ఉన్న QR కోడ్ లో వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు అంటే వాలిడిటీ, రూట్ ఇతర ముఖ్యమైన వివరాలు పొందుపరచి ఉంటాయన్నారు. పర్మిషన్ తీసుకున్న వాహనాలన్నీ ఈ ప్రత్యేక QR కోడ్ కలిగిన స్టిక్కర్లను తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ టి శ్రీనివాస రావు ఐపీఎస్ , అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎసిపి హనుమంత రావు, గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ నవీన్ పాల్గొన్నారు.

మై ట్రాన్స్ పోర్ట్ ఇజ్ సేఫ్”యాప్ వివరాలను వెల్లడిస్తున్న సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ టి. శ్రీనివాస రావు IPS.,

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here