అడ్డగుట్ట కాలనీలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ప‌ర్య‌ట‌న

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వెస్టర్న్ హిల్స్ సొసైటీ అడ్డగుట్ట కాలనీ రోడ్ నంబర్ 11 లో నూతనంగా నిర్మిస్తున్న సివ‌రేజ్ పైప్ లైన్ పనులను జలమండలి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలసి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ‌నివాస రావు మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పాత సివ‌రేజ్ పైప్ లైన్ స్థానంలో నూతనంగా 300 డ‌యా పైప్ లైన్, మ్యాన్ హోల్స్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఏ చిన్న సమస్య అయినా త‌న దృష్టికి వ‌స్తే తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here