మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయనగర్ కి చెందిన ఎక్కల్దేవ్ మైసయ్య యాదవ్ 7వ వర్ధంతి సందర్భంగా మైసయ్య యాదవ్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మైసయ్య యాదవ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ఎక్కల్దేవ్ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిల్స్, పేద క్రీడాకారులకు రూ.35వేల విలువైన కరాటే కిట్ లను గాంధీ పంపిణీ చేశారు. అనంతరం అన్న దాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రంగరావు, డివిజన్ తెరాస అధ్యక్షులు సంజీవ రెడ్డి, జిల్లా గణేష్, యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశీనాధ్ యాదవ్, నర్సింగరావు, పోతుల రాజేందర్ పాల్గొన్నారు.
