మియాపూర్, (నమస్తే శేరిలింగంపల్లి): రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అధికారులను ఆదేశించారు. బుధవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీ లో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించిన ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ గాంధీ మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా ఆకాలంగా కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపు ప్రాంతల్లో పర్యటించి,సహాయక చర్యల పనులను స్వయంగా పర్యటించి తెలుసుకుంటున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ముంపు ప్రాంతాల్లో ఎక్కడ సమస్య ఉన్న తక్షణమే అధికారులతో కలిసి వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నాల విస్తరణ పనులలో భాగంగా మిగిలిపోయిన అసంపూర్తి పనులను వెంటనే చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు అందరు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్రంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేయాలనీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఎక్కడ ఏ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ఏఈ రమేష్ , వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు చంద్రిక ప్రసాద్ గౌడ్, అశోక్, గోపరాజు శ్రీనివాస రావు ,ఆనంద్, గోపాల్ కృష్ణ , మురళి, దయానంద్ , దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.