సంక్షేమ ప‌థ‌కాలు మెచ్చి యువ‌త టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు: రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌

మ‌హిళ‌ల‌కు కండువా క‌ప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేందర్ యాద‌వ్‌

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.‌ బుధవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో వార్డు మెంబర్ శ్రీకళ నేతృత్వంలో అంబర్ సింగ్, సూరజ్,‌ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్య‌లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాగం నాగేందర్ యాదవ్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువకులను, మహిళలను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు,‌ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధిని‌ చూసి అన్ని వర్గాల వారు ఆనందంతో గులాబీ కండువా కప్పుకుంటున్నారని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ‌అన్నారు. అనంత‌రం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా జన్మదిన‌ కేకును‌ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ,‌ సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు‌, ఎస్ఎంసీ‌‌ చైర్మన్ బసవరాజు,‌ నాయకులు‌ శ్రీనివాస్, మహేందర్, యోగి,‌ శ్రీహరి, మహిళా సీనియర్ నాయకులు చంద్రకళ, రజిని,‌ భాగ్యలక్ష్మీ, ‌జయమ్మ,‌ సుజాత, కళ్యాణి, రోజా, కుమారి తో పాటు పార్టీలో చేరిన వారిలో వినోద్ కుమార్, శ్రీఖర్, శాంతన్, నాని, శ్రీకాంత్, సాయి, బాలు, సూర్య, ముక్రమ్, పవన్, నరేష్, సతీష్, జయ, వరుణ, కోటేశ్వరీ తదితరులు ఉన్నారు.

పార్టీలో చేరిన రాజీవ్ గృహ‌క‌ల్ప యువ‌త‌తో కార్పొరేట‌ర్ నాగేంద‌ర్ యాద‌వ్‌, శ్రీక‌ళ‌, అంబ‌ర్ సింగ్‌, సూర‌జ్‌, ప్ర‌వీణ్‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here