కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపుడి గాంధీ అన్నారు. డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ మరియు ప్రేమ్ నగర్ కాలనీ లోని ఓపెన్ నాల పూడికతీత మరియు క్లీనింగ్ పనులను ఆయన సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ మాట్లాడుతూ నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని నాలలను వెంటనే క్లీనింగ్, పూడిక తీత పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు. అధికారులందరూ అప్రమత్రంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై నిర్లక్ష్యం తగదని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ,ఎక్కడ ఏ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ రమేష్, ఏఈ శ్రీనివాస్ ,మరియు మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు శ్రీనివాస్ చౌదరి, గఫుర్ తదితరులు పాల్గొన్నారు.