మియాపూర్‌లో పోలీసుల భారీ ర్యాలీ

ర్యాలీని ప్రారంభించి అడుగు ముందుకు వేస్తున్న ఏసీపీ కృష్ణ ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్ సామ‌ల వెంక‌టేశ్‌, ట్రాఫిక్ సీఐ సుమన్‌

-పోలీసు అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళి

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మియాపూర్ భారీ ర్యాలీ నిర్వ‌హించారు. మియాపూర్ బొల్ల‌రాం చౌర‌స్తావ‌ద్ద మియాపూర్ ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్ సామ‌ల వెంక‌టేశ్‌, ట్రాఫిక్ సీఐ సుమ‌న్‌లు ర్యాలీని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కై ప్రాణాలు సైతం లెక్క‌చేయకుండా సేవ‌లందించేది పోలీసులని, విది నిర్వ‌హ‌ణ‌లో అసువులు బాసిన పోలీసుల‌ను స్మ‌రించుకోవాల్సిన భాద్య‌త ప్ర‌తి ఓక్క‌రిపైనా ఉంటుంద‌న్నారు. సమాజంలో పోలుసుల‌కు ఉన్న‌త స్థానం క‌ల్పించ‌బ‌డింద‌ని, దానిని కాపాడుకుంటు అంకిత‌బావంతో సేవ‌లు అందించాల‌ని సిబ్బందికి వారు సూచించారు. ఈసంద‌ర్భంగా విధినిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన ఉమేష్ చంద్ర‌, ప‌ర‌దేశి నాయుడు, వ్యాస్ లాంటి ప్ర‌ముఖుల త్యాగాల‌ను వారు స్మ‌రించుకున్నారు. అనంత‌రం ర్యాలీ మియాపూర్ జాతీయ ర‌హ‌దారి వెంట ఆల్విన్ కాల‌నీ మీదుగా మియాపూర్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుంది. అక్క‌డ పోలీసులు అంద‌రు అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు రవికిర‌ణ్‌, వీర‌భ్ర‌హ్మం, మౌనిక‌, యాద‌గిరి, ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఏఎస్ఐ ప్రేమ‌, రామంచంద‌ర్, మ‌ల్లేష్ త‌దత‌రులు పాల్గొన్నారు.

ఆల్విన్ చౌర‌స్తా వ‌ద్ద పోలీసులు ర్యాలీని ప‌ర్య‌వేక్షిస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేశ్‌ మియాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో పోలీసు అమ‌ర‌వీరుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి
ఘ‌టిస్తున్న‌ఇన్‌స్పెక్ట‌ర్ సామ‌ల వెంక‌టేశ్‌, ట్రాఫిక్ సీఐ సుమన్‌, సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here