శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీహెచ్ఈఎల్ లోని ఓల్డ్ ఎంఐజీ కాలనీలో పోలీసు అమరవీరులకు నాయకులు నివాళులు అర్పించారు. కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, చందానగర్ ఎస్ఐ చాంద్ పాషాలు ముఖ్య అతిథులుగా హాజరై ఐపీఎస్ సురేంద్ర బాబు నాయక్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డానియెల్ రాజ్, తిలావత్, రాజేష్ చిన్నా, రాజ్ కుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.






