- మంత్రి శ్రీధర్ బాబు కలిసి వినతి పత్రం అందించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ వినతిపత్రాన్ని అందించారు.
రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తున్న ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, సంబంధిత అధికారులకు చేపట్టే అభివృద్ధి పనులపై పక్క ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ఆదేశించాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు అండగా ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.