మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుల భవనాలకు స్థలాలు మంజూరు చేసి తమ కులస్థులను మాత్రం గుర్తించడం లేదని అగ్ని(వహ్ని) కుల క్షత్రీయ సేవా సంస్థాన్ సభ్యులు పేర్కొన్నారు. మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లోగల పెయిర్స్ ఫౌండేషన్ కార్యాలయంలో అగ్నికుల క్షత్రియుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ అగ్ని(వహ్ని)కులక్షత్రియులు దేశంలోని నలుమూలల విస్తరించి తెలంగాణ, దక్కను, దక్షిణ భారతావనిలోని ప్రాంతాలలో అగ్నికులక్షత్రియ, వన్నియకులక్షత్రియ, వన్నియర్, పల్లి, పల్లిరెడ్డి, పల్లికాపు, వన్నిరెడ్డి, వన్నికాపు లుగా పిలువబడుతున్నారని తెలిపారు. తమది అణగారిన బీసీ, ఎంబీసీ కులమని, దేశంలోని వివిధ ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు నుండి వచ్ఛే తమ కులస్తులకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కుల సంక్షేమ భవనం నిర్మించుకునేందుకు స్థలం మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులస్థులతో ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాలని తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా అగ్ని(వహ్ని) కులక్షత్రియులకు http://sites.google.com/site/agnivahnikukutpally వెబ్సైటును ప్రారంభించారు.ఈ సమావేశంలో కుల సభ్యులు డాక్టర్ కనగలూరు చంద్రశేఖరయ్య, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.






