చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి అభ్యర్థి రామచందర్‌రావు చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నవతరెడ్డి, టిఆర్ఎస్ నాయకురాలు బొబ్బవిజయ్‌రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచందర్‌రావుతో పాటు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ కాంటెస్టెడ్ అభ్యర్థి కసిరెడ్డి సింధూ రెడ్డి, నాయకులు రాకేష్ దూబే, రఘునాథ్ రెడ్డి, అమిత్ దూబే తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ కార్పొరేటర్ బొబ్బనవతరెడ్డితో అభ్యర్థి రామచందర్‌రావు





