ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలి: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ పార్టీ  అభ్యర్థిగా సురభి వాణీదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం సురభి వాణి దేవికి మద్దతుగా చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ  వెస్ట్ మెట్రో అపార్ట్మెంట్, శ్రీ లక్ష్మీ శుభం ఆర్కేడ్ అపార్ట్మెంట్, భవాని పురం కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో  పట్టభద్రులను కలిసి సురభివాణి దేవికి ఓటు వేయాలని కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాలనీవాసులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ దక్షిణ భారత దేశం నుండి ఎన్నికైన తొలి తెలుగు ప్రధాని, మన తెలంగాణ వాసి , ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన ప్రధాని పీవీ  నర్సింహ రావు గారి కుమార్తె సురభి వాణి దేవిని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం మన అందరి బాధ్యత  అని తెలిపారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి సురభి వాణి దేవిని అఖండ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలన్నారు.  తెలియయజేసారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా ఆయా కుటుంబాల్లోని గ్రాడ్యుయేట్లు గుర్తించేలా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్,  తెరాస నాయకులు గుడ్ల ధన లక్ష్మీ, నాయి నేని చంద్రకాంత్,  జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర్లు,ప్రవీణ్, దాసరి గోపి, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, దాస్ అసోసియేషన్ వాసులు రామారావు,బాపిరాజు, ఫిరోజ్,రఘునందన్ , శ్రీనివాస్, లక్ష్మీ కాంత్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here