- ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి
నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ స్థాయిలోనే ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పార్టీ పాతరేస్తున్నదని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి అన్నారు. మియాపూర్ ప్రాంతంలోని ఎంఏనగర్ లో జరిగిన ఎం సి పి ఐ (యు) పార్టీ సభ్యుల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతోన్మాద పాసిజాన్ని పాటిస్తున్న బిజెపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి దేశ అత్యున్నతమైన చట్టసభ పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో చొరబడి సమావేశాలను గందరగోళపరిచిన వారి పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుపోగా ప్రభుత్వాన్ని నినదించిన ప్రతిపక్ష, విపక్ష 141 మంది నిర్దాక్షంగా సస్పెండ్ చేయడం పార్లమెంటు స్థాయిలోనే ప్రజాస్వామ్యానికి పాతర వేసిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఆశిస్తూ నిరంకుశత్వం దేశ ప్రజలు గమనిస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి రాబోయే ఎన్నికలలో బిజెపి మతోన్మాద విధానానికి సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత కలిగి ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తా అని అధికారాన్ని అంటగట్టారు. కానీ కాంగ్రెస్ గత పాలన లెక్కనే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు.
అంగడి పుష్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంసిపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, వి.తుకారాం నాయక్, కమిటీ సభ్యులు గాదె మల్లేష్, టి.అనిల్ కుమార్, తాండ్ర కళావతి, పల్లె మురళి, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శివర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, కర్ర దానయ్య, హైదరాబాద్ కమిటీ సభ్యులు డి లక్ష్మి. మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు, జి శివాని, డి నర్సింహా, జి లలిత, గౌసియా బేగం, అరుణ, జయలక్ష్మి ఇంద్ర దేవేందర్, లక్ష్మి పాల్గొన్నారు.