ఎంపీల బహిష్కరణను ఖండిస్తున్నాం : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్

బీజేపీ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ (ఎంపీ)లపై బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ధోరణికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మియపూర్ అల్విన్ కాలనీ x రోడ్డు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధిలో, ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చి, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారని, వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేసిన పార్టీ సభ్యులను పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయే దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరసన తెలిపినందుకు ఎంపీల బహిష్కరణను ఖండిస్తున్నామన్నారు.

(ఎంపీ)లపై బీజేపీ పార్టీ తీరుపై పార్టీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ రిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ నిరసన

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు భాను ప్రసాద్, జానకీరామరాజు, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, నాయకులు శ్రవణ్ కుమార్, మహిపాల్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, సాంబశివరావు, వీరేందర్ గౌడ్, మారేలా శ్రీనివాస్, బాష్పక యాదగిరి, కల్పన ఏకాంత్ గౌడ్, సాయి బాబా, సురేష్ నాయక్, నగేష్ నాయక్, శేఖర్ ముదిరాజ్, వెంకటేశ్ గౌడ్, నరేందర్ గౌడ్, రవి కుమార్, విజయభాస్కర్ రెడ్డి, నవీన్ రెడ్డి, రాజీ రెడ్డి, ప్రసాద్, మల్లికార్జున్ రావు, ఖాజా, ముకన్న, గోపాల్, సయ్యద్ తహెర్ హుస్సేన్, రమేష్, కృష్ణ గౌడ్, మహిళలు రేణుక, శిరీష సత్తుర్, నాగమణి, స్వాతి పాల్గొన్నారు.

రోడ్డుపై నిరసన తెలుపుతూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here