చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ తుల్జా భవాని ఆలయ పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ ఉద్యమకారులు మల్లికార్జున శర్మను టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, గుర్ల తిరుమలేష్ లు ఘనంగా సన్మానించారు. శేరిలింగంపల్లిలో తొలి తెలంగాణ ఉద్యమకారుడికి ఎట్టకేలకు తగిన గుర్తింపు దక్కిందన్మారు. పెద్దలు మల్లికార్జున శర్మ కు సముచిత స్థానం కల్పించినందుకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవులకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా చిన్న పహిల్వాన్, శివ కుమార్, శ్రవన్ పాండే తదితరులు పాల్గొన్నారు.