శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని తారానగర్ తుల్జాభవాని దేవాలయం నూతన కమిటీ చైర్మన్‌గా నియామకమైన తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు ఎం.మల్లికార్జున శర్మకు, ఆలయ కమిటీ సభ్యులు సంజీవ్ రెడ్డి, రేణుక గౌడ్, గోవింద్ చారి, యాష్కీ సంపత్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న పలువురు నేతలు పార్టీలకు అతీతంగా వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేంద్ర ప్రసాద్, బుచ్చిరెడ్డి, చిన్నాగౌడ్, శివకుమార్, మల్లారెడ్డి, మారం వెంకట్, మల్లికార్జున రెడ్డి, యాదగిరి యాదవ్, గుర్ల తిరుమల్లేష్, దినేష్, శ్రావణ్ పాండే, పప్పు సేటు, బాలరాజ్, పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.