మ‌ద్యం మ‌త్తులో ఒంటికి నిప్పంటిచుకుని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: మ‌ద్యం మ‌త్తులో ఒంటికి నిప్పంటిచుకుని ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… పాపిరెడ్డి న‌గ‌ర్ కాల‌నీలో నివాస‌ముండే సురేష్‌(25) ఆటో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ భార్య గీత‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో నివాస‌ముంటున్నాడు. కాగా ఈ మార్చి 31వ తేదీన సురేష్ మ‌ద్యం సేవించి ఇంటికి వ‌చ్చాడు. కొద్దిసేప‌టి త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తాన‌ని భార్య‌తో చెప్పి వెళ్లాడు. చాలాసేప‌టి వ‌ర‌కూ సురేష్ తిరిగి రాక‌పోవ‌డంతో గీత చుట్టుప్ర‌క్క‌ల వారి స‌హాయంతో స‌మీప ప్రాంతాల్లో వెత‌క‌గా కాల‌నీలోని ఆర్‌కే మోడ‌ల్ స్కూల్ వ‌ద్ద సురేష్ మంట‌ల్లో కాలుతూ క‌నిపించాడు. వెంట‌నే మంట‌ల‌ను ఆర్పి ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో సురేష్ భార్య గీత ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సురేష్ మృత‌దేహం

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here