నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక స్థోమత లేని పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య చికిత్సకోసం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. గురువారం మియాపూర్ డివిజన్ పరిధిలోని బికె ఎనక్లేవ్ కాలనీ కి చెందిన పాండురంగారావు ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.1లక్ష ఆర్థిక సహాయానికి సంబందించిన పత్రాలను బాధిత కుటుంబానికి ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ ప్రజా క్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని తెలిపారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, సురేందర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.






