నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జ్యోతిక రెడ్డి శిష్య బృందం చేసిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, చతుస్రా అలరిపు, నటేశ కౌతం, జతిస్వరం, భో శంభో, కళ్యాణి జతిస్వరం, గోకులంబుడి శబ్దం, అంబలం తిల్లై, అంబ స్తుతి, శివ పంచాక్షరీ స్తోత్రం, తిల్లాన అంశాలను సహస్ర, హాసిక, పూర్వి, కృతిక, స్నిగ్ధ, హితశ్రీ, ఆరాధ్య, శాన్విత, పూర్ణ, సర్విక, హంసిక, హర్షిత, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. సంగీత నాటక అకాడమీ అవార్దీ కళారత్న పసుమర్తి రామలింగ శాస్త్రి, నాట్య గురువర్యులు, నిర్మల ప్రభాకర్ ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను సత్కరించారు.
