సామాన్యుడికి రియల్ మోసం

  • సామాన్య, మధ్య తరగతి ప్రజలను నిండా ముంచేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ
  • 300 మంది నుండి 50 కోట్లు సేకరణ..  బోర్డ్ తిప్పేసిన వైనం
  • కంపెనీ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన
తమకు న్యాయం చేయాలంటూ కంపెనీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు

నమస్తే శేరిలింగంపల్లి: సామాన్య, మధ్య తరగతి ప్రజలను నిండా ముంచేసింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. సుమారు 300 మంది నుంచి సుమారు 50 కోట్లు సేకరించి బాధితులను రోడ్డున పడేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాలు.. గుంటూర్ కు చెందిన జానీ భాషా షేక్ మియాపూర్ లోని అల్విన్ చౌరస్తాలో మైత్రి ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించాడు.
హైదరాబాద్ లో వివిధ వెంచర్ల పేరుతో రాయల్ లీఫ్ – గాగిలాపూర్, రాయల్ ప్యారడైజ్ – రామేశ్వర్ బండ, రాయల్ మింట్ – మామిడిపల్లి, హాంప్టన్ పామ్స్ – మామిడిపల్లి, ఓపెన్ ప్లాట్లు అమ్ముతానని నకిలీ డాక్యూమెంట్ల అగ్రిమెంట్లు చూపించి, ఒక్కొక్కరి వద్ద నుంచి 25 లక్షల రూపాయల మేర కట్టించుకున్నాడు. అయితే పెట్టుబడిదారులు ప్లాట్లు అడగడంతో ఏదో ఒక సాకు చూపిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలా మూడేళ్ళుగా సాగింది. చివరకు మకాం మార్చి పారిపోయాడు. దింతో న్యాయం చేయాలని కోరుతూ బాధితులు మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలోని కార్యాలయంలో ధర్నా చేపట్టి  మియాపూర్ పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయా ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టిన వారంతా మధ్యతరగతి, దిగువ తరగతి చెందిన వారే. వారంతా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు.

మరెవరికి ఇలా జరగొద్దు..
పది సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ప్లాట్ కొనుగొలుకు ఇచ్చాం. అందరం జానీ భాషా షేక్ చేతిలో మోసపోయాం. తమకు వెంచర్ యజమానుల సహకరించడం లేదు. తామలా మరెవరు మోసపోవద్దు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి.
– రాజశేఖర్, బాధితుడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here