ఎల్ అండ్ టీ అపార్ట్మెంట్ వాసుల దీక్షకు కాంగ్రెస్ నాయకుల మద్దతు

గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎల్ అండ్ టీ అపార్ట్మెంట్ వాసుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మన్నె సతీష్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్కాన్ కన్స్ట్రక్షన్ వారు నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట నిర్మాణాలను చేపడుతూ ఎల్ అండ్ టి అపార్ట్మెంట్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రి పూట నిర్మాణాలను నిలిపివేయాలంటూ అపార్ట్మెంట్ వాసులు గత ఇరవై నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకునే వారే ఖరువయ్యారన్నారు. జీహెచ్ఎంసి, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి బాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సురేష్ నాయక్, నగేష్ నాయక్, అహ్మద్ ఖాన్, అర్జున్ రెడ్డి, అపార్ట్మెంట్ వాసులు పాల్గొనడం జరిగింది.

ఎల్ అండ్ టీ వాసుల దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న మన్నె సతీష్, వేదికపై కాంగ్రేస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here