యెందుకింత నిర్లక్షం
యేమిటి నీ గొప్పతనం
కరోనా గాయం
తెలుసోకోవ సత్యం
మెలుకవలోని నిజం
మార్చు కోవ పయనం
యెందుకింత నిర్లక్షం
యేమిటి నీ గొప్పతనం
కమ్మిన కార్చిచ్చు
నట్టెట నిను ముంచు
నమ్మిన నీ వాళ్లు
వదిలిపెట్టి పోవచ్చు
విష వలయం కౌగిట్లొ
బందీ నీవూ కావచ్చు
యెందుకింత నిర్లక్షం
యేమిటి నీ గొప్పతనం
నేవె ఒక ఉద్యమమై
అందరిలో ఉపిరివై
పది మందికి సాయమైతే
సాయం నిను వదలదు
మనసున్న మనిషి వంటు
చరిత నిన్ను మరువదు
యెందుకింత నిర్లక్షం
యేమిటి నీ గొప్పతనం

బతుకు వైచిత్రం
భగ్గు మన్న భారతం
భావి తరపు కాన్వాసుపై
బుగ్గి పాలు భవితం
మన మనుగడ శూన్యం
యెవరి చావు వారిదంటు
వదిలిందా ఖర్మo
చేయాలి ప్రతి మనిషి
మనిషి కింత సాయం
మాస్కు నీవు వదలకు
యెమరుపాటు యెంచకూ
యెందుకింత నిర్లక్షం
యేమిటి నీ గొప్పతనం
కనీస జాగ్రత్తలు పాటించు
అందరిలో అవగాహన కల్పించు
స్వచ్చత నీ రక్షనని
శుభ్రత నీ మనుగడని
నిర్లక్షపు మాలిన్యం
మనుగడపై అపహాస్యం
యెందుకింత నిర్లక్షం
యేమిటి నీ గొప్పతనం
దూరంగా నే ఉండు
నీకు నీవు హద్భందూ
ఆగాలి కరోన క్రతువు
కోరాలి మనవాళి హితవు.
మారాలి మనం సంఘo
బ్రతకాలి జనం సత్యం.
అందరికిదీ పూజ్యం
యెందుకింత నిర్లక్షం
యేమిటి నీ గొప్పతనం
✍️
ఇరువింటి రవి






