28 ఏళ్ల తర్వాత అ’పూర్వ’ కలయిక… పాఠశాల స్మృతులు నేమరేసుకున్న స్నేహితురాళ్లు…

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ఉత్సాహంగా జరిగింది. 1994 – 95 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థినులు ఒక్కచోట చేరి సందడి చేశారు. తారానగర్ లోని సుజాత అనే పూర్వ విద్యార్థిని నివాసంలో జరిగిన ఈ సమ్మేళనంలో 28 ఏళ్ల క్రితం నాటి స్నేహితులు ఎంతో సంతోషంగా భాగస్వామ్యం అయ్యారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాటి నేటి పరిస్థితులను బేరీజు వేసుకుని తమ తమ సంతోషాలను, బాధలను పరస్పరం పంచుకున్నారు.

తారానగర్ లోని సుజాత నివాసంలో ఏకమైన 1994 – 95 బ్యాచ్ విద్యార్థినిలు

సమయాబావం వల్ల నాటి తరగతిలో ఉన్న పూర్తిస్థాయి విద్యార్థినులందరం కలుసుకోలేక పోయామని, త్వరలోనే అందరం ఏకమై అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థినిలు సుజాత, మమత, రమాదేవి, పి.కవిత, బాలమణి, కల్పన, లలిత, లక్ష్మీదేవి, విద్య, ఆధిలక్ష్మీ, జ్యోతి, కవిత, విజయలక్ష్మీ, ప్రభావతి, కె.మంజుల, భవానీ, మేరి ప్రిస్కిల్లా, సరళ, బి.జ్యోతి, రేణుక, మంజుల తదితరులు పాల్గొన్నారు.

స్నేహితురాళ్ల సెల్ఫీ సందడి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here