శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సామాన్యులు ఎంతో ఆసక్తిగా గమనించే అరుదైన ఖగోళ దృశ్యం జీరో షాడో డే (Zero Shadow Day) ను త్రివేణి విద్యాసంస్థల విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా వీక్షించారు. సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకు రావడం వల్ల నీడ మాయమయ్యే ఈ అద్భుతాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం నిర్వహించిన ప్రత్యేక పోటీలలో విద్యార్థులు పాల్గొన్నారు. జీరో షాడో డే కు సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను ఫోటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి ఈ కాంపిటీషన్ లో తమ ప్రతిభను చాటుకున్నారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయగా, ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకున్న విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సిఆర్ఓ సాయి నరసింహ రావు, ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న , హాస్టల్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రావు, నాగరాజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.





