శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ యువత అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏప్రిల్ 5వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకులతో రాజీవ్ యువ వికాసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో, యువత సాధికారత, ఆర్థికాభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ముఖ్యమంత్రి, మంత్రులు ఈ పథకం కోసం రూ.6వేల కోట్లను కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ పథకం కింద లక్ష రూపాయల వరకు రుణాలకు 80 శాతం సబ్సిడీ, రెండు లక్షల వరకు ఉన్నవారికి 70 శాతం సబ్సిడీ, మూడు లక్షల వరకు ఉన్న రుణాలకు 60 శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్.టి), వెనుకబడిన తరగతులు (బీసీ),(ఈ.డబ్లు.ఎస్), మైనారిటీ వర్గాల యువతకు స్వయం ఉపాధి రుణాలను అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించడానికి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుందని, ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు జూన్ 2న, తెలంగాణ నిర్మాణ దినోత్సవం రోజున రాయితీ రుణ మంజూరు పత్రాలు అందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, నియోజకవర్గ కార్డినెటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, రేణుక, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, బాష్పక నాగమణి, బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీదేవి, భాగ్యలక్ష్మి, మహిళ నాయకులు పార్వతి, పర్వీన్, జయ, ప్రియదర్శిని, అనిత, దుర్గ, శ్రీజ రెడ్డి, విజయ లక్ష్మి, నియోజకవర్గ నాయకులు శేఖర్ ముదిరాజ్, కావూరి ప్రసాద్, వీరేందర్ గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, వాసు, కట్ల శేఖర్ రెడ్డి, మిరియాల ప్రీతం, ఉరిటీ వెంకట్ రావు, మన్నెపల్లి సాంబశివరావు, పట్వారీ శశిధర్, సంగారెడ్డి, యాదయ్య గౌడ్, నర్సింహ గౌడ్, లక్ష్మీ నారాయణ, ఖాజా, శివ, విష్ణు, సౌందర్య రాజన్, వాసు, కృష్ణ యాదవ్, కృష్ణ గౌడ్, విల్సన్, యలమంచి ఉదయ్ కిరణ్, రవి, వెంకన్న, శంకర్, వెంకటేష్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, నర్సింహ రెడ్డి, చెన్నయ్య సాగర్, వెంకట్ సాగర్, అంజన్న సాగర్, అమరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నితిన్, శివానంద్ రెడ్డి, ఆదిత్య, రాంబాబు, చందానగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధు, సుధాకర్, యాదయ్య, సత్తి రెడ్డి, రెహ్మాన్, వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి, శివ కుమార్, హనుమంతు, నర్సింహ, అంజి, రాంబాబు, వెంకట్ రెడ్డి, పొచ్చన్న, గణేష్, ప్రభు, బాబ్జి, హరి, మౌలానా, సర్దార్, నరేష్, అంజి, రవి, మల్లేష్, మహేష్, విష్ణు, కృష్ణ, ప్రభాకర్, కృష్ణ, సాజిద్, సయ్యద్ బాబా, భరత్, భీమ్ రావు, మోహన్ రెడ్డి, వెంకట్, ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు చంద్రమౌళి, వివేకానంద నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుచంద్రశేఖర్, కార్తీక్ గౌడ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.