శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): బద్రీ విశాల్ పన్నాలాల్ P.T. ట్రస్ట్, అగ్రవాల్ సేవా దళ్ సహకారంతో బాలాజీ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శిబిరంలో 300 మందికి పైగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అవసరమైనవారికి ఉచిత కంటి శస్త్ర చికిత్సకు గాను పేర్లను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ మందిర్ ట్రస్ట్ నిర్వాహకులు ప్రదీప్, నిఖిల్, మహేష్ జీ శర్మ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.