స్వామి వివేకానంద మార్గంలో యువ‌త న‌డ‌వాలి: కసిరెడ్డి భాస్కరరెడ్డి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): స్వామి వివేకానంద భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అని బిజెపి నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గౌతమీ నగర్ మున్సిపల్ పార్కు, చందానగర్ లోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానంద ఆశయాలకు అనుగుణంగా ఆయన చెప్పిన మార్గాన యువత నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నూనె సురేందర్, కార్యదర్శి ఆదిశేషయ్య, నూకల తనవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here