శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శానిటేషన్ రివ్యూ మీటింగ్ ను శేరిలింగంపలి జోన్ మీటింగ్ హాల్ లో జోనల్ కమిషనర్ హేమంత్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీలలో అంతర్గత రహదారులు సైతం పరిశుభ్రతకు నెలవుగా నిలవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ పేర్కొన్నారు. ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితుల నుంచి ముక్కున వేలేసుకునేంత శుభ్రంగా అందంగా రహదారులను తీర్చిదిద్దాలని ఇందుకు క్షేత్రస్థాయిలో చేపట్టే పారిశుద్ధ్య చర్యలే అత్యంత ప్రధానమన్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ప్రధానంగా పరిశుభ్రత చర్యలను ఏలా చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలకు శేరిలింగంపల్లి జోన్ వేదికగా ఉన్నందున ఆ స్థాయిలోనే రహదారుల నిర్వహణ జరగాలని, క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టే చర్యలే ఇందుకు ప్రధానమన్నారు. స్వీపింగ్ అనంతరం వెంటనే చెత్త కుప్పలు తొలగించాలని, ఫ్లె ఓవర్‌లపై మట్టి ఇసుక ఇతర వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జడ్సీ ఆదేశించారు. డీసీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని, లోటు పాట్లను సవరించుకుంటూ చక్కని పరిసరాలు నెలకొనేలా చూడాలన్నారు. ప్రతి షాపు , కమర్షియల్ ఏరియా దుకాణాలలో డస్ట్ బిన్ ఏర్పాటు చేయాలి, దానికి గాను ఈ నెల 15 తేదీని ఆఖరి రోజుగా పరిగణించారు. లేదంటే పెనాల్టీ పడుతుంది అని ప్రతి దుకానానికి తెలియచేయమని చెప్పారు. ఈ మీటింగ్ లో డిప్యూటీ కమిషనర్లు ప్రశాంతి, శశిరేఖ, సురేష్, కృష్ణ, ప్రదీప్ , DE, Swms, SRP, SFAs రాంకీ సిబ్బంది పాల్గొన్నారు.






