యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా ఇంటర్నేషనల్ కార్యాలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఢిల్లీలోని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ యూత్ హాస్టల్స్ చైర్మన్ సిద్దిన బోయిన వెంకట్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ కార్యాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. 1909లో జర్మనీలో రిచర్డ్ శర్మన్ స్కూల్ ఉపాధ్యాయుడు స్థాపించిన యూత్ హాస్టల్ నిర్మాణం జర్మనీ నుంచి యూరప్, అమెరికా, అమెరికా నుంచి మన మైసూర్ మహారాజా కొడుకు ద్వారా మైసూర్ లో మొదలు పెట్టారని తెలిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత మాజీ ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇలాంటి కార్యాలయం ఉంటే బాగుంటుందని చాణక్యపురి లో రెండు ఎకరాల స్థలంలో ఈ హాస్టల్ కు నెహ్రూ చేత ఆమోదించబడిందని అన్నారు. 1951 లో మొదలైన యూత్ హాస్టల్ కట్టడం 1955 లో పూర్తయి ప్రస్తుతం కొన్ని వేల మందికి అక్కడికి వచ్చే యాత్రికులకు, విద్యార్థులకు, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కు వారికి ఆతిథ్యాన్ని ఇస్తూ వసతి ని ఇస్తూ తక్కువ రేట్ లో ఢిల్లీలో వీవీఐపీ జోన్ లో ప్రశాంతమైన వాతావరణంలో 70 ఏళ్లుగా సేవలు అందిస్తుందన్నారు. నేషనల్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్స్ ను, ట్రెజరర్, సీఈఓ లను కలిసి తెలంగాణ రాష్ట్రంలోనూ ఇంటర్నేషనల్ హాస్టల్ నిర్మాణం చేపట్టి అంతర్జాతీయ సంస్థను అభివృద్ధి చేద్దామని చర్చించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here