హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ కార్పొరేటర్లుగా గెలిచినందుకు గాను హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్లను యూత్ కాలనీ లో తెరాస మహిళా కార్యకర్తలు, స్థానికులు సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ తమకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ల పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యులు కే వెంకటేష్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఏరియా సభ్యులు సుదర్శన్, శ్రీశైలం, సయ్యద్ సాబేర్, యూనుస్, సుదేశ్, ఇమ్రాన్, తసిమ్, సయ్యద్ అహ్మద్, ముజీబ్, పాషా, షబానా, దౌలత్ బీ, నజియా, నుసరత్, జరీనా, మాలన్, ఫారత్, బీజాన్ బీ, జులేక బీ, లక్ష్మి, రేఖ, రాధ, వెంకటమ్మ, మల్లమ్మ, సాకేరా బేగం, వసియా బేగం పాల్గొన్నారు.






