చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి సందర్బంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.







