గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్‌టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీల్లో ఆదివారం కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పర్యటించారు. నూతనంగా నిర్మించిన డ్రైనేజీ లైన్లు, రోడ్లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, వార్డు మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, నాయకులు నారాయణ, రమేష్ గౌడ్, నవాజ్, నారాయణ్, నరసింహ రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.







