యేగి వేమ‌న జ‌యంతి వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దాం: శేరిలింగంప‌ల్లి రెడ్డి సంక్షేమ సంఘం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): యోగి వేమ‌న జ‌యంతి వేడుక‌ల‌ను విజ‌యవంతం చేయాల‌ని శేరిలింగంప‌ల్లి రెడ్డి సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. విశ్వ‌క‌వి వేమ‌న రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం చందాన‌గ‌ర్‌లోని విక్ట‌రీ లాడ్జ్‌లో వేడుక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు సంఘం అధ్య‌క్షులు న‌ల్లా సంజీవ‌రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు గున్నాల అనిల్ రెడ్డి, ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి, గోవ‌ర్ధ‌న్ రెడ్డీలు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ కార్య‌క్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్ట‌ర్ గ‌డ్డం రంజిత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వేమ‌న చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. అదేవిధంగా ఇటీవ‌ల జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందిన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన‌ మంజులా ర‌ఘునాథ్‌రెడ్డి(చందాన‌గ‌ర్‌), సింధు ఆద‌ర్శ్ రెడ్డి(భార‌తీ న‌గ‌ర్‌), గంగాధ‌ర్ రెడ్డి(గ‌చ్చిబౌలి)ల‌ను సంఘం త‌ర‌పున ఘ‌నంగా స‌న్నానిస్తున్న‌ట్టు తెలిపారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని రెడ్డి బంధువులంద‌రు పెద్ద సంఖ్య‌లో పాల్గొని కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here