హఫీజ్‌పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో చందానగర్ సర్కిల్ ఏఈ అనురాగ్ మహాదేవ్ సోమవారం పర్యటించారు. స్థానికంగా ఉన్న హిందూ ముస్లిం స్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పించాలంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బల్దియాకు లేఖ రాసిన నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. డివిజన్ ఎంఐఎం నాయకుడు ఇమ్రాన్ అహ్మద్ స్థానికంగా నెలకొన్న సమస్య తీవ్రతను ఏఈకి వివరించారు. స్పందించిన అనురాగ్ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, వారి సూచన మేరకు ముందుకు సాగుతామని అన్నారు.