పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ లోని పి జె ఆర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో యోగ అభ్యాసకులు పాల్గొని యోగ ప్రోటోకాల్ ను పాటించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు పుట్ట వినయకుమార్ గౌడ్, తరిగొప్పుల స్వేత, జగన్నాథం, బోనకుర్తి విఠల్ లను అభ్యాసకులు ఘనంగా సన్మనించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగ అంటే వ్యాయామ ప్రక్రియ మాత్రమే కాదని అదొక జీవన విధానమని అన్నారు. ప్రాపంచిక ఆందోళనలను తగ్గించి మనిషికి ప్రశాంతతను ప్రసాదించే దివ్య ఔషధం యోగ అని అన్నారు. మనిషి ఆయుష్షును పెంచే సాధన ఏదైన ఉందంటే అది యోగా మాత్రమేనని అన్నారు. అనారోగ్యాల బారిన పడకుండా ముందే అప్రమత్తం అవ్వాలని, అందుకు నిత్యం యోగానే శరణ్యమని అన్నారు. ఈ నేపథ్యంలో పలువురు చిన్నారులు యోగా విన్యాసాలతో ఆకట్టుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here