శేరిలింగంప‌ల్లిని అగ్ర‌గామిగా తీర్చిదిద్దుతా: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో రూ.35.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన లింక్ (సీసీ) రోడ్డును కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన , అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఈ లింక్ రోడ్డు ద్వారా ఆదిత్య నగర్ కాలనీ ప్రజలకు సాంత్వన చేకూరింద‌ని ,పెద్ద ఉపశమనం లభించింద‌ని అన్నారు. వసంత సిటీ నుండి ఆదిత్య నగర్ వెళ్లాడనికి ఎంతో ఉపయోగపడుతుంద‌ని , ప్రజలకు ఇంధనం , సమయం ఆదా అవుతాయ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here