శేరిలింగంపల్లి, జూన్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): భారతదేశంలో కానీ, అంతర్జాతీయంగా కానీ ప్రజలందరికీ ఆరోగ్యాన్నిచ్చే దివ్యమైన ఔషధమే యోగా అని గుల్ మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు మీర్ ఖాసిం తెలిపారు. యెగా భావితరాలకు కూడా ఆశా దీపం, ఆదర్శమవుతుందని, లోక కల్యాణం అవుతుందని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాలనీలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యోగాలో మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు భక్తి, ఆధ్యాత్మికత, ఉత్తమ లక్షణాలు, మంచి ప్రవర్తన, మంచి జీవన విధానం ఉంటాయని అన్నారు. గుల్‌మోహర్ పార్క్‌లో పతంజలి ఉచిత యోగా తరగతులను నిత్యం గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, పరిసర కాలనీ వాసులు వినియోగించుకుని జీరో మెడిసిన్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని యోగా గురువు నూనె సురేందర్, గారెల వెంకటేష్ కోరారు.
నిత్యం యోగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి, శారీరక దారుఢ్యం పెరుగుతాయని, జీవన విధానంలో మార్పు వస్తుందని నేతాజీనగర్ కాలనీ అధ్యక్షుడు, బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర చారి, రాజేందర్, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు బిల్డర్ వెంకన్న, రాజేంద్ర ప్రసాద్, సాయినాథ్, హరిఓం, యెగా గురువులు ఉదయ కుమారి, సాయి ప్రియ, సీనియర్ సభ్యులు గాయత్రి, రమ్య, విజయ, గణేష్, వర ప్రసాద్, 100 మంది అభ్యాసకులు పాల్గొన్నారు.