శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను స్థానిక నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ విలేజ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించడం జరిగిందని, ఇలాంటి సదుపాయాలను లయన్స్ క్లబ్ వారు పాఠశాలల అభివృద్ధి కోసం ముందుకు రావడం మంచి విషయం అని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మదన్ మోహన్, శ్రీలక్ష్మి, కృష్ణయ్య, బాలాజీ, వినోద్ కుమార్, యూసఫ్, స్థానిక నాయకులు ప్రతాప్ రెడ్డి, మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, లయన్స్ క్లబ్ సభ్యులు గాంధారి శ్రీనివాస్, గాయత్రి, రాజు, శ్రీనివాస్, హనుమంత్ రావు తదితరులు పాల్గొన్నారు.