చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మహా స్కంధ షష్టి సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ వల్లీ శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి పంచామృత మహా అభిషేకాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సత్యసాయి ఆచార్యులు, రమేష్ శర్మ, రవిశర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి పూజలను నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఉదయం 10 గంటల నుండి 12 గంటలవరకు ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు.








