నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఘనంగా నిర్వహించారు. 185 వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ను పురస్కరించుకుని మియాపూర్ డిజిటల్ ఫొటోస్టూడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మియాపూర్ పాత పోలీస్ స్టేషన్ నుండి జేపీ నగర్ కమ్యూనిటీ హాల్ వరకు ఫోటో గ్రాఫర్లు బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. భవిష్యత్తు ప్రణాళికలు, తరచుగా ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై చర్చించుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు వాల్మీకి వెల్లడించారు. ఉపాధ్యక్షుడు రమేష్, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ విజయ్, జాయింట్ సెక్రటరీ గణేష్, ట్రెజరర్ అన్నర్ ఖాన్, మీడియా పాట్నర్ మహేష్, ఏరియా ఇంచార్జీ శ్రీను, విష్ణు, నాగరాజు, శేఖర్,హర్ష, కిరణ్, సత్యనారాయణ, హలీం, షాజహాన్, కరుణాకర్, జానీ పాషా, షైక్ గౌస్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.