ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్లలో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్ కాలనీలో కోటి 30 లక్షల నిధులు, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో రూ. 90 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

మాదాపూర్ డివిజన్ లో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. సీసీ రోడ్లు, పలు అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం శ్రీమన్నారాయణ, మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వాలా‌ హరీష్ రావు, డివిజన్ల అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డు సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, రామచందర్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు చారీ, శర్మ ఎస్ ఆర్ పీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, దొంతి శేఖర్, మనోహర్ గౌడ్, కంది జ్ఞానేశ్వర్, రఘునాథ్, సాయి బాబా, హనీఫ్, చంద్రశేఖర్, రాజు యాదవ్, ప్రభాకర్, రవి కుమార్, దామోదర్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, పద్మారావు, ఉమేష్, రవితైలి కృష్ణ, సుధీర్, లక్ష్మణ్, కృష్ణ, దేవేందర్, ఎం.ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ లో‌ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here